Telugu Gateway
Telangana

కిడ్నాప్ కేసులో ఏ వీ సుబ్బారెడ్డి అరెస్ట్

కిడ్నాప్ కేసులో ఏ వీ సుబ్బారెడ్డి అరెస్ట్
X

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత మాజీ మంత్రి అఖిలప్రియ మీదే ఆరోపణలు రాగా..ఇప్పుడు ఏ వీ సుబ్బారెడ్డి కేసులో ఏ1గా పోలీసులు తేల్చారు. అఖిలప్రియ ఏ2గా పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారెడ్డి ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఈ కిడ్నాప్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ1 నిందితుడిని కాదన్నారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న పేర్లనే పోలీసులు చెప్పారన్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వ్యాఖ్యానించారు.

ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానన్నారు.. ప్రవీణ్ రావు తమ కుటుంబ స్నేహితుడు అని , నిజాలు బయటకు వచ్చాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానన్నారు. ఈ కేసులో తనకెలాంటి పాత్ర లేదని బాధితులే చెబుతారన్నారు. హఫీజ్ పేట భూ వివాదం కేసులోనే ఈ కిడ్నాప్ జరిగిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. కిడ్నాపర్లు ఐటి అదికారులమంటూ నకిలీ సెర్చ్ వారంట్లు చూపించారన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఏపీ పోలీసులతో కూడా మాట్లాడామన్నారు.

Next Story
Share it