హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కుదుపు తప్పదా?!
జీఓ 111 ఎత్తివేయటం అంతా సాఫీగా సాగిపోతే ఆ ప్రాంతంలో రేట్లు తగ్గుతాయి అని రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. జీఓ 111 రద్దు ప్రకటన చేసిన సమయంలో తొలుత గ్రీన్ జోన్ లు ఏర్పాటు చేస్తారు అని ప్రకటించారు. ఇప్పుడు అవి ఏమీ ఉన్నట్లు లేవు. దీంతో ఇప్పుడు హెచ్ఎండీఏ లో ఎలా అయితే భూమి వాడకం ఉందో అక్కడ కూడా అలాగే వాడుకోవచ్చు అన్నమాట. దీంతో పెద్ద ఎత్తున భూమి అందుబాటులోకి రానుంది.అయితే ఇది అంత తేలిగ్గా జరిగే అవకాశం లేదు అని...న్యాయపరంగా చిక్కులు తప్పవనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా బిఆర్ఎస్ సర్కారు అటు రాజకీయ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలు పొందనుంది అని అధికారులు చెపుతున్నారు. ఇవి అన్నీ ఒకెత్తు అయితే ఇక్కడ తెర వెనక చాలా డీల్స్ జరిగాయనే చర్చ అధికార వర్గాల్లో ఉంది.