Telugu Gateway
Telangana

టి హ‌బ్ 2 రెడీ!

టి హ‌బ్ 2 రెడీ!
X

తెలంగాణ‌లో స్టార్ట‌ప్ లకు మ‌రో వేదిక అందుబాటులోకి రానుంది. 3.5 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల నిర్మాణంతో ఇన్నోవేష‌న్ స్పేస్ హ‌బ్ రెడీ అయింద‌ని తెలంగాణ ఐటి, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం నాడు ఈ టి హ‌బ్ 2 ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ టీ హ‌బ్ 2 ఏకంగా 2000కుపైగాస్టార్ట‌ప్స్ కు వేదిక కానుంద‌న్నారు. ఇది దేశంలోనే రెండ‌వ అతి పెద్ద టెక్ ఇంక్యుబేట‌ర్ అని, ప్ర‌పంచంలోనే రెండ‌వ‌ద అని తెలిపారు. తెలంగాణ నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కోసం అవ‌స‌ర‌మైన ఎకోసిస్ట‌మ్ ను అందించే కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తుంద‌ని తెలిపారు.

Next Story
Share it