Telugu Gateway
Politics

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఒప్పుకోం

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఒప్పుకోం
X

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయన్న ఆయన, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేన్నారు. ప్రైవేట్‌ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా నడుపుతాయి. కాబట్టి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వైజాగ్‌ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

అదే సమయంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక గా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పై విమర్శలు గుప్పించారు. ''వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత "గంట" మోగిస్తున్నారు. ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ "గంట" శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా?'' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it