తొమ్మిది మంది మాజీ మంత్రులకు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులు

అధికార వైసీపీ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతోంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తవటంతో పార్టీ నియామకాలను కూడా వైసీపీ అధినేత, సీఎం జగన్ పూర్తి చేశారు. అందులో భాగంగా మంగళవారం నాడు 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తలను కూడా నియమించారు. ఇటీవల మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తొమ్మిది మంది మంత్రులకు జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించారు. వీరు అంతా పార్టీ కోసం పనిచేసి..తిరిగి వైసీపీని విజయతీరాలకు చేరిస్తే మళ్లీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- కేఆర్‌జే భరత్, అనంతపురం- కాపు రామచంద్రారెడ్డి, సత్యసాయి- శంకర్‌నారాయణ, ఎన్టీఆర్ జిల్లా- వెల్లంపల్లి, గుంటూరు- సుచరిత, కర్నూలు- బాలనాగిరెడ్డి, నెల్లూరు- మేమిరెడ్డి, బాపట్ల- మోపిదేవి, నంద్యాల- కాటసాని, గుంటూరు- కొడాలి నాని, అన్నమయ్య- శ్రీకాంత్‌రెడ్డి, కడప- సురేష్ బాబు, తిరుపతి- చెవిరెడ్డి, ప్రకాశం- ముధుసూదన్ యాదవ్, బాపట్ల మోపిదేవి వెంకటరమణ, గుంటూరు మేకతోటి సుచరిత, పల్నాడు పిన్నెళ్ళి రామక్రిష్ణారెడ్డి, ఎన్ టీఆర్ జిల్లా వెల్లంపల్లి శ్రీనివాసరావు, క్రిష్ణా జిల్లా పేర్ని వెంకట్రామయ్య, ఏలూరు ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తూర్పు గోదావరి జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్, కాకినాడ కురసాల కన్నబాబు, కోనసీమ పొన్నాడ వెంకట సతీష్ కుమార్, విశాఖపట్నం ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి కరణం ధర్మశ్రీ, అల్లూరి సీతారామరాజు కొట్టగుల్లి భాగ్య లక్ష్మీ, పార్వతీపురం మన్యం పాముల పుష్పవాణి, విజయనగరం చిన్న శ్రీను, శ్రీకాకుళం ధర్మాన క్రిష్ణదాస్ లను వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు.