Telugu Gateway
Politics

చంద్రబాబు కుట్రలో ఎస్ఈసీ భాగస్వామి

చంద్రబాబు కుట్రలో ఎస్ఈసీ భాగస్వామి
X

అంతా సద్దుమణిగింది అనుకున్న వేళ మళ్లీ వార్ మొదలైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ముఖ్యనేతలు వరస పెట్టి ఎటాక్ ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రమేష్ కుమార్ అంతా చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారని..ఆయన ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారు.

సీనియర్ అధికారుల పట్ల ఎస్‌ఈసీ వాడిన భాష సరికాదు. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ లేఖ రాశారు. అధికార యంత్రాంగాన్ని అస్థిరపరచాలని ఎస్‌ఈసీ చూస్తున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ డీఎన్‌ఏ ఒక్కటే. నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉండటం రాష్ట్రం ఖర్మ. దేశవ్యాప్తంగా జనవరి 16న సీఈసీ ఓటర్ల జాబితా విడుదల చేసింది..గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే కనీసం 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత కానీ ఎన్నికలు జరపలేమని నిమ్మగడ్డకు కూడా తెలుసు.. అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగులు, అధికారుల్లో నిమ్మగడ్డ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు.

చంద్రబాబు నిర్ణయాలను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు. ఎస్‌ఈసీ కేవలం సిఫారసు మాత్రమే చేయగలరు... అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్‌ను ప్రభుత్వం అమలు చేయదు. అధికారులెవరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. అధికారుల విషయంలో నిమ్మగడ్డ చేసిన దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మా అధికారులను రక్షించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహా అయితే ఈ కొద్దీ రోజులు డ్యూటీ నుంచి పక్కన పెట్టొచ్చు. ఆ రోజు ఇదే చంద్రబాబు.. ఇదే ద్వివేదిని ఛాంబర్ లోకి వెళ్లి ఈసీ అంటే పెద్దాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరో రకంగా వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా వరస పెట్టి రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Next Story
Share it