Telugu Gateway
Politics

పేర్ని నాని వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు స్పందించ‌రేం?

పేర్ని నాని వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు స్పందించ‌రేం?
X

తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు రాష్ట్రాల‌ను క‌లిపేద్దామంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. దీన్నీ బ‌ట్టి చూస్తుంటేఏ నాని వ్యాఖ్యల‌ను వీరు స్వాగతించినట్లే కదా అని సందేహం వ్య‌క్తం చేశారు. ఇలాంటి కుట్రలను ప్రజలు సహించరని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయడం.. కలిసిపోదాం అని పేర్నినాని అనడం.. అనుకోకుండా జరిగినవి కావన్నారు. జ‌గ‌న్, కెసీఆర్ లు ఉమ్మ‌డి రాష్ట్రం కోస‌మే పాచిక‌లు క‌దిలిస్తున్న‌ట్లు ఉంద‌న్నారు. కెసీఆర్ రాజ్య విస్త‌ర‌ణ మ‌ళ్లీ రెండు రాష్ట్రాల‌ను క‌లిపే కుట్ర జ‌రుగుతోంది. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్‌ అనుమానం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు క‌లిసిపోతే జ‌ల‌వివాదాలు ఉండ‌వు అనే వాద‌న తెర‌పైకి తెచ్చే అవ‌కాశం ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. మంత్రి కేటీఆర్ భీమవరంలో పోటీ చేస్తారో, లేక తన పూర్వీకులు ఉన్న బొబ్బిలిలో పోటీ చేస్తారో తెలియదని చెప్పారు. వీళ్ల ఆలోచ‌న, ప్ర‌క‌ట‌న‌లు తెలంగాణపై కుట్ర చేస్తున్న‌ట్లు క‌న్పిస్తోంది. ఇలాంటి వాటిని తెలంగాణ ప్ర‌జ‌లు ఏ మాత్రం స‌హ‌రించ‌రు. ఏ చిన్న విష‌యం మాట్లాడినా గ‌తంలో పిచ్చికుక్క‌ల్లా మాట్లాడేవారు.

కానీ ఇప్పుడు ఇంత జ‌రుగుతున్నా ఒక్క‌రు కూడా అర‌వ‌టం లేదంటే..ఆ కుక్క‌ల సంఘం నేత ఏమి ఆదేశించి ఉంటాడంటారు. చిన్న చిన్న విష‌యాల‌కు మొరిగిమొరిగి అరిచే కుక్క‌లు ఎందుకు మౌనంగా ఉన్న‌ట్లు అని ప్ర‌శ్నించారు. జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. తెలుగుత‌ల్లిని గ‌తంలో ఇష్టానుసారం తూల‌నాడి ఇప్పుడు ప్లీన‌రీలో అంత పెద్ద విగ్ర‌హం ఎందుకు పెట్టిన‌ట్లు? పొర‌పాటు జ‌రిగితే వివ‌ర‌ణ ఇచ్చి ఉండొచ్చు. లేదు మేం ఇద్ద‌రి త‌ల్లుల‌ను గౌర‌వంగా చూస్తామంటే అలా అయినా చెప్పిఉండొచ్చు. నేను ఇద్ద‌రు త‌ల్లుల దొంగ కొడుకుని అని ప్ర‌క‌టించుకుని ఉండొచ్చ‌ని ఎద్దేవా చేశారు. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు అన్నీ చూస్తుంటే ఏదో కుట్ర జ‌రుగుతోంద‌నే అనుమానం క‌లుగుతోంది. దీన్ని అంద‌రూ క‌ల‌సి చేధించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ‌లో అన్నీ దోచుకున్నాడు..ఇప్పుడు ఏపీకి వెళ్లి స‌ముద్ర దొంగ‌గా మార‌దామ‌నుకుంటున్నాడో ఎవ‌రికి తెలుసు అని వ్యాఖ్యానించారు.అస‌లు ప్లాన్ ఏంటో ఆయ‌న‌కే తెలియాలంటూ కెసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

Next Story
Share it