Telugu Gateway
Politics

వెనక్కి తగ్గిన ఈటెల

వెనక్కి తగ్గిన ఈటెల
X

మార్గదర్శకాలు తెలిసి ఎందుకు ప్రకటించినట్లు?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తొలి వ్యాక్సిన్ డోసు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గారు. వ్యాక్సిన్ పై నమ్మకం కలిగించేందుకు తానే తొలి వ్యాక్సిన్ తీసుకుంటానని ఈటెల పలుమార్లు ప్రకటించారు. శనివారం నాడు దేశమంతా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న సమయంలో శుక్రవారం నాడు కూడా మంత్రి ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కేంద్రం వెల్లడించిన మార్గదర్శకాలు తెలియదా?. తెలిసి కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించి మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గినట్లు?. ప్రధాని మోడీ స్వయంగా రాజకీయ నేతలు ఎవరూ వ్యాక్సిన్ కూడా క్యూకట్టొద్దని ప్రకటించారు. ఇది కొద్ది రోజుల క్రితమే జరిగింది. మరి అలాంటప్పుడు ఈటెల రెండుసార్లు ఎందుకు బహిరంగంగా ప్రకటించారు.

ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు వ్యాక్సిన్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అమెరికాకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ జో బైడెన్, దుబాయ్ రాజుతోపాటు మరికొంత మంది అగ్రనేతలు కూడా బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుని ప్రజలకు భరోసా కల్పించారు. కానీ మోడీ మాత్రం ఈ విషయంలో ముందుకు రాలేదు. కానీ ఈ విమర్శలను ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో రాజకీయ నేతలు ఎవరూ ముందు వరసలో వ్యాక్సిన్ తీసుకోవద్దనే వాదన తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం కూడా ఉంది.

Next Story
Share it