Telugu Gateway
Politics

ఓడిపోతామనే కెసీఆర్ ఓట్లు అడగటం లేదు

ఓడిపోతామనే కెసీఆర్ ఓట్లు అడగటం లేదు
X

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే సీఎం కెసీఆర్ నేరుగా పట్టభద్రులను ఓట్లు అడగటంలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్ర మంత్రులకు అపాయింట్ మెంట్ ఇస్తారని..సీఎం కెసీఆర్ ఒక్క ఓవైసీకి తప్ప ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీని కలసినప్పుడు ఎందకు ఐటిఐఆర్ ప్రాజెక్టు గురించి ప్రశ్నించలేదన్నారు. బండి సంజయ్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కెటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ అంత పోటుగాడైతే.. అజంజాహీ మిల్స్, నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని సవాల్ విసిరారు. కేటీఆర్ తన ఏడుపు తాను ఏడిస్తే బాగుంటుందన్నారు. విశాఖపట్నంలో వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకుంటారని బండి సంజయ్ పేర్కొన్నారు.

తెలంగాణ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను పట్టభద్రుల ఆశీస్సులతో బిజెపి గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా బిజెపికి అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో అత్యంత కీలకమైన ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలను నిర్వీర్యం చేసిన తెలంగాణ సర్కారు..పార్టీలోని తన నలుగురు అనుచరులకు మాత్రం ప్రైవేట్ యూనివర్శిటీలు కట్టబెట్టారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తేనే ఎన్నికల హామీలు నెరవేరతాయని వ్యాఖ్యానించారు. 2023లో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరటం కెసీఆర్ చూడాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిజంగా కెసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనుకుంటే ఈసీ అనుమతి తీసుకుని ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించారు.

Next Story
Share it