Telugu Gateway
Politics

పశ్చిమ బెంగాల్ మళ్ళీ మమతాదే!

పశ్చిమ బెంగాల్ మళ్ళీ మమతాదే!
X

టీఎంసీకి 158, బిజెపికి115 సీట్లు

టైమ్స్ నౌ..సీ ఓటర్ ఎగ్జిట్ పోల్

రిపబ్లిక్...మరికొన్ని ఛానళ్ళ అంచనా బిజెపిదే అధికారం

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా?. గురువారం రాత్రి వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే అధికార టీఎంసీ పార్టీనే లీడ్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. టైమ్స్ నౌ-సీ ఓటర్ అంచనాల ప్రకారం టీఎంసీకి 158 సీట్లు, బిజెపికి 115 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే చాలా సీట్లలో మాత్రం మార్జిన్ అతి తక్కువగా ఉందని తెలిపారు. ఎన్డీటీవీ కూడా టీఎంసీకి 294 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ లో 156 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది. బిజెపికి 121 సీట్లు రావొచ్చని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఎనిమిది దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో పలితం ఎలా ఉండబోతున్నదా అన్న అంశంపై దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిజెపిని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. రిపబ్లిక్ టీవీ మాత్రం పశ్చిమ బెంగాల్ లో బిజెపికే అధిక సీట్లు వస్తాయని తన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో పేర్కొంది. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ అంచనాల ప్రకారం బిజెపికి 138-148 సీట్లు వస్తాయని అంచనా వేశారు. టీఎంసీకి 128-138 సీట్లు అంచనా వేశారు. అయితే కొన్ని చానళ్ళు టీఎంసీకి లీడ్ చూపించగా..మరికొన్ని మాత్రం బిజెపికి భారీ లీడ్ చూపించాయి. మే2న ఈ పలితాలు వెల్లడి కానున్నాయి. ఇండియా టీవీ బిజెపికి ఏకంగా 172 నుంచి 192 సీట్లు వస్తాయని పేర్కొంది. టీఎంసీకి 64-88 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

Next Story
Share it