Telugu Gateway
Politics

రేవంత్ ఏమి చేస్తాడో చూస్తాం

రేవంత్ ఏమి చేస్తాడో చూస్తాం
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ‌రోసారి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మీడియా ను ఆకర్షించడానికి ఆయ‌న రోజూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాల‌యంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుమ‌ర్తి లింగ‌య్య‌లు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సభ్యుడి గా, పీసీసీ అధ్యక్షుడిగా హుందా గా ఉండాల్సింది పోయి బజారు భాష మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. తా చెడ్డ కోతి వనమల్లా చెరిపిందని ...కాంగ్రెస్ మొత్తాన్ని బండ బూతుల వైపు తీసుకెళ్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ ను హింసా మార్గం వైపు తీసుకెళ్లి తెలంగాణ లో శాంతి భద్రత ల సమస్య తేవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. జూన్ ఏడ‌వ తారీఖు ఎంతో దూరం లేద‌ని..ఏమి చేస్తాడో చూస్తామ‌న్నారు.కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎందరెందరో కుట్రలు పన్నుతున్నారు ..రేవంత్ అందులో ఒకర‌న్నారు. తెలంగాణ వ్యతిరేకుల చేతిలో రేవంత్ కీలు బొమ్మ అన్నారు. ప్రజల‌ హృదయాల్లో ఉన్న కెసిఆర్ ను త‌ప్పించ‌టం బ్రోకర్ల వల్ల కాదన్నారు. డ‌బ్బులు పెట్టి పీసీసీ ప‌ద‌వి కొనుక్కున్నార‌ని మ‌రోసారి ఆరోపించారు.

Next Story
Share it