Telugu Gateway
Politics

తెలంగాణ మొత్తాన్ని బంగారు తునకలా చేస్తాం

తెలంగాణ మొత్తాన్ని బంగారు తునకలా చేస్తాం
X

నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సభలో కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణ మొత్తాన్ని బంగారు తునకలా చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంచి పార్టీని..మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే అన్నారు. '2500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో లిఫ్ట్ లకు శంకుస్థాపన చేశాం. ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. నేతలు ఈ ఛాలెంజ్ తీసుకోవాలి. మాట ఇచ్చామంటే వెనక్కి తగ్గబోం. పార్టీల నాయకత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. సిఎల్పీ నేత పొలం బాటు అని బయలుదేరాడు. పొలానికి ఏమైంది?. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరు? మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు అంటున్నారు. అప్పుడు మీరు నాగార్జున సాగర్ కట్టింది కూడా కమిషన్లకే అని ఒప్పుకుంటారా?. ఫ్లోరైడ్ భూతాన్ని వంద శాతం తరిమేశాం.

చంద్రబాబు హయాంలో పొలాలు ఎండబెట్టినా ఎవరూ మాట్లాడలేదు. నాడు కరెంట్ లేదు. ఎరువులు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. దేశంలోఅత్యధిక వడ్లు ఎఫ్ సిఐకి ఇస్తున్నది తెలంతగాణ రాష్ట్రం. ఈ మొఖాలన్నీ నాడు ఏమి చేశాయి. కళ్యాణలక్ష్మీ దేశంలో ఎక్కడాన ఉందా? గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళితే లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. కాంగ్రెస్ ది దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యం. మీరు గొర్రెలు మింగారు..మేం గొర్రెలు ఇస్తున్నాం. మీరు రైతు బంధువులు కాదు..రైతు రాంబంధులు. కాంగ్రె స్ నేతలు కూడా రైతు బంధు తీసుకుంటూ మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్ఎస్. నాగార్జున సాగర్ లో మంచి ప్రభుత్వాన్ని..మంచి పార్టీని కాపాడుకోవాలి. నేను చెప్పిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి. నిజమే అయితే మిగిలిన పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయండి.' అని కెసీఆర్ కోరారు. టీఆర్ ఎస్ వీరుల పార్టీ అని..వెన్నుచూపే పార్టీ కాదన్నారు. కొంత మంది రాజకీయ గుంటనక్కలు వస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు.

వారిని చేసి మోసపోతే ఆగమైపోతామని హెచ్చరించారు. నాకు అండగా ఉండండి..మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత నాదన్నారు కెసీఆర్. ప్రాజెక్టులు అన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే ప్రశ్నించటానికే టీఆర్ఎస్ పుట్టిందని తెలిపారు. అంతకు ముందు జిల్లాపై పలు వరాలు కురిపించారు కెసీఆర్. 'ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు. మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు. నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు. మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం. మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు. నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.186 కోట్లు మంజూరు చేస్తున్నాం.' అని ప్రకటించారు.

Next Story
Share it