రాహుల్ కంటే ఎక్కువ మెజారిటీ
BY Admin23 Nov 2024 7:56 PM IST
X
Admin23 Nov 2024 7:59 PM IST
బరిలో నిలిచిన తొలి ఎన్నికలోనే ప్రియాంక గాంధీ సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళ లోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు 4 , 10, 931 ఓట్ల మెజారిటీ తో సంచలన విజయం దక్కించుకున్నారు. రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో దక్కించుకున్న మెజారిటీ కంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ మరింత మెజారిటీ తో విజయం సాధించటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియాంక గాంధీ కి మొత్తం 6 , 22 , 338 ఓట్లు పోల్ అయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే తాజగా జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినా కూడా ఆమె మెజారిటీ పెరగటం కీలకం. ఇక్కడ సిపీఐ అభ్యర్థి రెండవ స్థానంలో ఉండగా...బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాసు మూడవ స్థానానికి పరిమితం అయింది.
Next Story