చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు
BY Admin14 Feb 2022 11:34 AM

X
Admin14 Feb 2022 11:34 AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయటంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉంటారు. తాజాగా ఆయన చంద్రబాబుకు వెరైటీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'దేశంలోని ఎన్నో పార్టీలతో ప్రేమాయణం సాగించిన వీర ప్రేమికుడు చంద్రబాబు. ప్రతి ఐదేళ్లకోసారి లవర్ ను మారుస్తూ ఉంటాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ వీర ప్రేమికునికి శుభాకాంక్షలు.' అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడా పొత్తు లేకుండా గెలవడు అంటూ వైసీపీతోపాటు పలు పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేమికుల దినోత్సవం రోజు ఈ వెరైటీ ట్వీట్ చేశారు.
Next Story