Telugu Gateway
Politics

అన‌ర్హ‌త‌పై మూడు నెల‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాలి

అన‌ర్హ‌త‌పై మూడు నెల‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాలి
X

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటుకు సంబంధించి వైసీపీ వ‌ర‌స పెట్టి పిటీష‌న్లు ఇస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ విప్ భ‌రత్ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌ల‌సి ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత కూడా ర‌ఘురామ‌రాజు త‌న దాడిని కొన‌సాగిస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త అంశంపై సీఎం జ‌గ‌న్ కు లేఖ‌లు రాస్తూ పార్టీకి చికాకు క‌లిగిస్తున్నారు. అంతే కాదు కోర్టుల్లో కేసులు కూడా వేస్తూ వైసీపీ స‌ర్కారును ఇర‌కాటంలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన త‌న లేఖ‌లో పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Next Story
Share it