Telugu Gateway
Politics

జనాగ్ర‌హ దీక్షలో పాల్గొన్న విజ‌య‌సాయిరెడ్డి

జనాగ్ర‌హ దీక్షలో పాల్గొన్న విజ‌య‌సాయిరెడ్డి
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏపీలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గ‌తంలో టీడీపీ పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని అన్నారు. 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్‌ ట్విట్టర్‌లో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యంగా దూషించడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన జ‌నాగ్ర‌హ దీక్షలో పాల్గొన్నారు.

మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు కూడా హ‌ద్దూఅదుపు లేకుండా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైనా అయ్య‌న్నకు బుద్ధి రాలేద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్నదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు.

Next Story
Share it