విజయసాయిరెడ్డి వర్సెస్ సోము వీర్రాజు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. బిజెపి నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. 'తిరుపతి ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారి జీవించండి..చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్ళీ వైసీపీనే దీవిస్తారు' అని వ్యాఖ్యానించారు.
దీనికి సోము వీర్రాజు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. 'మా ఊసు ఎందుకులే విజయసాయిరెడ్డి గారూ..!!! . కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.' అంటూ సమాధానం ఇచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT