మేం ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పల్లకీ మోయం

తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్ తో మాట్లాడుతూ తాను, కొడాలి నాని ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటామన్నారు. అదే సమయంలో నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తే వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఆయన పల్లకీ మోస్తారేమో అన్న భయం నారా లోకేష్ లో ఉందన్నారు. అది ఎప్పటికీ జరగదన్నారు. తాము దేవినేని ఉమామహేశ్వరావులాగా సూట్ కేసులు మోయలేదని, నారా లోకేష్ లాగా సూట్ కేసులు తీసుకోలేదన్నారు.
నారా లోకేష్ గురించి మాట్లాడాలంటే ఆయన మీద అసమర్ధుడి రాజకీయ యాత్ర అని పుస్తకం రాయోచ్చని వ్యాఖ్యానించారు. స్వయంగా మహానాడులోనే టీడీపీకీ జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని ప్రకటనలు చేశారని..పాత వీడియోల్లో ఈ విషయం ఎవరైనా వినొచ్చని వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి విషయంలో తాను తప్పు మాట్లాడానని భావించినందునే క్షమాపణ చెప్పానని, కానీ టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తనపైన, తన కుటుంబ సభ్యులపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు ఎప్పుడైనా వాటికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా అని ప్రశ్నించారు.