Telugu Gateway
Politics

మోడీ వ్యాక్సిన్ ఉత్సవాల వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

మోడీ వ్యాక్సిన్ ఉత్సవాల వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్
X

దేశంలోని పలు రాష్ట్రాలు తమకు సరిపడినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంలేదని ఫిర్యాదులు చేస్తుంటే ..ప్రధాని మోడీ వ్యాక్సిన్ ఉత్సవాలు నిర్వహించాలంటూ పిలుపునివ్వటంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.. సీరియస్ సమస్యపై అందరూ ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని..వ్యాక్సిన్ విషయంలో కూడా రాష్ట్రాల మధ్య తేడా చూపించటం సరికాదన్నారు రాహుల్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. గురువారం రాత్రి దేశంలోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోడదీ ఈనెల 11 నుంచి 14 తేదీల మధ్య వ్యాక్సిన్ ఉత్సవం నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే.

దేశంలో వ్యాక్సిన్ కొరత అనేది చాలా సీరియస్ సమస్య అని, అది పండగ కాదని అన్నారు. భారత్‌లో తయారైన టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని కూడా రాహుల్ ప్రశ్నించారు. చాలా సెంటర్లలో కోవిడ్ టీకాలు లేవని, వాటిని మూసేస్తున్నారని పేర్కొన్నారు.దేశంలోని ప్రజలు కరోనా కారణంగా తీవ్ర సమస్యల్లో ఉన్న తరుణంలో వ్యాక్సిన్ ఎగుమతులు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.

Next Story
Share it