రేవంత్ కు బాధ్యతలు అప్పగించి జిందాల్ నేచర్ క్యూర్ కు ఉత్తమ్
టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమితులైన రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కొత్త టీమ్ కు అభినందనలు తెలిపారు. బుధవారం నాడు ఒకటిన్నరకు రేవంత్ కు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పది రోజుల పాటు బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ సెంటర్ లో చేరనున్నట్లు తెలిపారు. తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
తనకు పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు ఎన్నో పదవులు అప్పగించిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాందీ, రాహుల్ గాంధీలకు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. క్రిష్ణా జలాలను నష్టపోవటం వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సమస్యలోకి నెడుతోందని విమర్శించారు. అవినీతి, నిరుద్యోగిత కొత్త గరిష్టాలకు చేరాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.