Telugu Gateway
Politics

అమెరికాలో' 'ట్రంప్ టెన్షన్'

అమెరికాలో ట్రంప్ టెన్షన్
X

అమెరికాను ఇప్పుడు రెండు టెన్షన్లు వణికిస్తున్నాయి. ఒకటి కన్పించని కరోనా టెన్షన్ అయితే.మరొకటి కన్పించే డొనాల్డ్ ట్రంప్ టెన్షన్. పదవి నుంచి దిగిపోయే ముందు ఆయన ఎలాంటి ఉపద్రవాలు తెచ్చిపెడతారా అన్న భయం అమెరికాలో నెలకొంది. అందుకే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రంప్ అభిమానుల్లో కొంత మంది ఉన్మాదులు ఉన్నారని..వాళ్లు ఆందోళనలు శృతిమించే అవకాశం ఉందనే సమాచారం ఎఫ్ బిఐకి సమాచారం అందుతోంది. అందుకే అమెరికాలో అంతటా అప్రమత్తం అయ్యారు. దీంతోపాటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం కూడా ఉద్రికత్తలకు దారితీస్తోంది. రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ సభ్యులు అడ్డుకున్నారు.

మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్‌ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్‌ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్‌లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్‌ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవి ఏ మేరకు పూర్తి అవుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it