Telugu Gateway
Politics

అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్..ట్రంప్

అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్..ట్రంప్
X

అమెరికాలో ఏదో జరుగుతోంది. అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించటం కూడా కష్టంగా ఉంది. ఎన్నికల్లో ఓటమి స్పష్టమైన తర్వాత కూడా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి అంగీకరించటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. తాజాగా ఆయన చేసిన తాజా ట్వీట్ మరింత కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయాన్ని అంగీకరించేది లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ వల్లే డెమొక్రాట్ అభ్యర్ధి బైడెన్ గెలిచారని ఆయన ట్వీట్ చేశారు. అక్రమాలకు పాల్పడటం ద్వారానే ఆయన‌కు గెలుపు సాధ్యమైందని ఆరోపించారు.

తమ లీగల్ టీం న్యాయపోరాటం చేస్తుందని ట్రంప్‌ తన ప్రకటనలో తెలిపారు. అయితే ట్రంప్ ట్వీట్ పై ట్విట్టర్ కిందనే ఓ హెచ్చరిక పేర్కొంది. ట్రంప్ చెబుతున్న ఎలక్షన్ ఫ్రాడ్ వివాదస్పదం అని పేర్కొంది. మీడియా ఫేక్ కథనాల్లోనే బైడెన్ గెలిచారని పేర్కొన్నారు. కీలక రాష్ట్రాల్లో కూడా కౌంటింగ్ పూర్తయి జో బైడైన్ పూర్తి మెజారిటీ విజయం సాధించారు. అయినా సరే ట్రంప్ మాత్రం ససేమిరా అంటూ అధికార మార్పిడికి ఏ మాత్రం సహకరించటం లేదు. అయితే ఈ వ్యవహారంపై బైడెన్ వర్గం కూడా న్యాయ పోరాటానికి సిద్ధం అవుతోంది.

Next Story
Share it