Telugu Gateway
Politics

అమెరికా కస్టడీలో ఆ దేశ అధ్యక్షుడు

అమెరికా కస్టడీలో ఆ దేశ  అధ్యక్షుడు
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నిత్యం ప్రపంచ శాంతిని కోరుకుంటున్నట్లు చెపుతూ ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే తాను ఎన్నో యుద్దాలు ఆపినట్లు కూడా పదే పదే చెప్పుకుంటున్నారు. గత ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఆశించి మరీ భంగపడ్డారు. ఇండియా-పాకిస్థాన్ యుద్ధం కేవలం తన జోక్యం వల్లే ఆగింది అని ఎన్ని సార్లు చెప్పారో లెక్కేలేదు. ఈ విషయాన్ని భారత్ పలుమార్లు ఖండించినా కూడా డోనాల్డ్ ట్రంప్ ఈ పాట పడుతూనే ఉన్నారు. ప్రపంచ శాంతి కోసం తాము ఒక్కళ్ళమే పాటుపడుతున్నట్లు చెప్పుకునే అమెరికా శనివారం నాడు వెనుజువెలా పై భీకర దాడులకు దిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వెనెజువెలా రాజధాని కారకాస్ తో పాటు సమీపంలోని మిరాండా , అరాగువా , లా గైరా రాష్ట్రాలలో శనివారం దాదాపు ఏడు చోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

అమెరికా యుద్ద విమానాలు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి దాడులకు దిగటంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. వెనుజువేలాలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడానికి ఆ దేశ భూభాగంపై దాడులు చేస్తామని కొద్ది రోజుల క్రితమే డోనాల్డ్ ట్రంప్ తీవ్రం గా హెచ్చరించారు. గత కొంత కాలంగా అమెరికా, వెనుజువెలా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. వెనెజువెలా గడ్డపై అమెరికా జరిపిన మొదటి ప్రత్యక్ష దాడి ఇదే అంటున్నారు నిపుణులు. ఈ దాడులు అక్రమ రవాణా స్థావరాలే లక్ష్యంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మారక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో డోనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచుతున్నారు. కరీబియన్ సముద్ర ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికడతామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే పసిఫిక్, కరేబీయన్ సముద్రాల్లో అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు నిర్వహిస్తుంది అమెరికా. పేలుళ్ల ధాటికి భయపడిన జనాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే వెనుజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్య తమ కస్టడీ లో ఉన్నారు అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో అమెరికా సైన్యం జరిపిన దాడులను కూడా ఆయన ధ్రువీకరించారు.

Next Story
Share it