Telugu Gateway
Politics

బిజెపి మ‌ళ్లీ గెలిస్తే తెలంగాణ‌..ఏపీని క‌లిపేస్తారు

బిజెపి మ‌ళ్లీ గెలిస్తే తెలంగాణ‌..ఏపీని క‌లిపేస్తారు
X

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ బిజెపిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ పార్టీకి మ‌రోసారి ఛాన్స్ ఇస్తే తెలంగాణ‌, ఏపీని క‌లిపేస్తార‌న్నారు. తెలంగాణ స‌ర్కారు రైతులుకు జీవిత బీమా క‌ల్పిస్తే..మోడీ మాత్రం ఈ బీమా అందించే ఎల్ ఐసీని ప్రైవేట్ ప‌రం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి స‌ర్కారు ఏమి చేసిందో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. ఈ ప్ర‌శ్న అడిగితే నోరేసుకుప‌డిపోవ‌టం త‌ప్ప మ‌రోక‌టి ఉండ‌టంలేద‌న్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, కాళేశ్వరం, పాలలూరుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప‌క్క‌నే ఉన్న క‌ర్ణాట‌క‌లో ఇచ్చి తెలంగాణ‌కు మాత్రం హ్యాండ్ ఇచ్చార‌న్నారు. కుల,మతాలకు అతీతంగా టీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంద‌ని, కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. . విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచమంటే నాలుగేళ్లయినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉంది. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా'' అంటూ కెటీఆర్ ఎద్దేవా చేశారు. గిరిజ‌న యూనివ‌ర్శిటీ అడిగితే వాట్స‌ప్ యూనివ‌ర్శిటీలో అబ‌ద్దాలు ప్ర‌చారం చేసే ప‌నిలో ఉన్నార‌న్నారు.

Next Story
Share it