Top
Telugu Gateway

బల్దియాపై మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే

బల్దియాపై మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే
X

బల్దియాపై మరోసారి ఎగిరేది గులాబీ జెండానే అని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటపై సీఎం కెసీఆర్ ఎప్పుడో జాతీయ జెండా ఎగరేశారని..అక్కడ ఏది పడితే అది ఎగరేయటం కుదరదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్ని వివిధ అంశాలపై మాట్లాడారు. 'రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు...ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్లదే అధికారం ఉంటుంది. లాక్ డౌన్ వల్లే ఆర్థిక సంక్షేభం దేశానికి రాలేదు..దానికంటే ముందే ఎనిమిది త్రైమమాసికాలు ఆర్ధిక రంగం సంక్షోభంలో కొనసాగింది. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 చోట్ల గెలిచాము..ఈ సారి 10సీట్లు గెలుస్తాం. ఎంఐఎం తో మాకు ఎలాంటి పొత్తులు లేవు.మళ్ళీ టీఆరెస్ అభ్యర్థి మేయర్ గా అవుతారు.

హైదరాబాద్ అభివృద్ధి మేము ఏమి చేశామో చూపిస్తా...బీజేపీ ఏమి చేసిందో చూపిస్తారా? బీజేపీ హైదరాబాద్ కు ఏమి చేస్తదో ...ఎన్ని నిధులు ఇస్తదో చెప్పి ఓట్లు అడగాలి. టీఆర్ఎస్ ఎవరి బీ టీమ్ కాదు. తెలంగాణ ప్రజల ఏ టీమ్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది అంటే వాళ్ళ స్వయంకృతాపరాధం. దానికి మేం కారణం కాదు. ' అని వ్యాఖ్యానించారు. దశాబ్దాల పాటు వెనకబాటుతనానికి గురైన తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక ఎంతో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే అల్లర్లు జరుగుతాయని విషప్రచారం చేశారని, ఇప్పుడు తెలంగాణ ప్రశాంతంగా ఉందంటే కేసీఆరే కారణంమని కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌పై విపరీతమైన దుష్ప్రచారం చేసినవారంతా నేడు కనుమరుగైయ్యారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ ఎక్కుడా గిల్లికజ్జాలకు పోకుండా అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని వివరించారు. టీఆర్‌ఎస్‌ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో పటిష్ట శాంతిభద్రతలున్నాయని చెప్పారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.

ఉగాదికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. 'రూ.2వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీరు అందించాం. 1920లో గండిపేట కడితే, 2020లో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ కడుతున్నాం. 90శాతం తాగునీటి సమస్యను పరిష్కరించాం. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్‌ కొరత ఉండేది. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్‌ ప్లాంట్‌ను కేంద్రం ఏపీలో కలిపింది. కేసీఆర్‌ ముందుచూపుతో విద్యుత్‌లోటు నుంచి మిగులు విద్యుత్‌కు చేరుకున్నాం. ఇప్పుడు లక్షలాది మంది కార్మికులకు తగినంత పని దొరుకుతుంది. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం తర్వాత చెత్త సేకరణ పెరిగింది. 6,500 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 40 లక్షల జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రథమస్థానంలో ఉంది. మరో రెండు డంపింగ్‌ యార్డ్‌ లను ఏర్పాటు చేస్తున్నాం. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తయ్యే ప్లాంట్‌ ప్రారంభించాం. నిర్మాణరంగ వ్యవర్థాలతో తయ్యారయ్యే టైల్స్‌ ప్లాంట్‌ను ప్రారంభించాం' అని కెటీఆర్ అన్నారు.

Next Story
Share it