Telugu Gateway
Politics

హుజూరాబాద్ ఫ‌లితం టెన్ష‌న్?. టీఆర్ఎస్ వ‌రంగ‌ల్ స‌భ వాయిదా!

హుజూరాబాద్ ఫ‌లితం టెన్ష‌న్?. టీఆర్ఎస్ వ‌రంగ‌ల్ స‌భ వాయిదా!
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప‌లితం ఎలా ఉండ‌బోతుంది?. ఈ విష‌యంలో అధికార టీఆర్ఎస్ లో కూడా టెన్ష‌న్ ఉందా?. లేకపోతే అక‌స్మాత్తుగా వ‌రంగ‌ల్ లో ఈ నెల 15న త‌ల‌పెట్టిన విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను అక‌స్మాత్తుగా ఎందుకు వాయిదా వేసిన‌ట్లు. ముందు ప్ర‌క‌టించి..ఇప్పుడు తేదీలో మార్పు వెన‌క ఉద్దేశం ఏమిటి? దీనికి సంబంధించి విడుద‌లైన ప్ర‌క‌ట‌న ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఓ సారి స‌భ‌పై నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత జిల్లాకు చెందిన నేత‌లు చెపితే స‌భ తేదీల‌ను కెసీఆర్ మారుస్తారా?. అది జ‌రిగే ప‌నేనా?. కానీ నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన‌ట్లు చెబుతూనే...వరంగల్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకే సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నార‌ని ప్ర‌క‌టించారు. నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో ' అనే నినాదంతో సిఎం కెసిఆర్ ప్రారంభించిన ధీక్షా దివస్' నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సిఎం కెసిఆర్ కు విన్నవించార‌ట‌. ఈ తేదీ కొత్త‌గా వ‌చ్చింది ఏమీ కాదు. విజ‌య‌గ‌ర్జ‌న స‌మావేశం తేదీ ఖ‌రారు స‌మ‌యంలో కూడా కెసీఆర్ ఎప్పుడు ధీక్షకు దిగారో అంద‌రికీ తెలుసు.

కానీ ఇప్పుడు తేదీ మార్చి..అందుకు చూపెడుతున్న కార‌ణాలు మాత్రం కేవ‌లం హుజూరాబాద్ ఫ‌లితాల కోణంలోనే అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. స‌భ వాయిదా ప‌డినందున చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకోని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టిఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సిఎం కెసీఆర్ కోరారు. . ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను (ఈ నెల) నవంబర్ 29 వ తేదీకి మార్చుకోవాలని సిఎం సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు. ఇప్ప‌టికే వెల్ల‌డైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ బిజెపికి అనుకూలంగా అంచ‌నాలు వెలువ‌రించాయి. ఒకటి అరా మాత్రం టీఆర్ఎస్ గెలుపును సూచించాయి. హుజూరాబాద్ ఫ‌లితం తేడాగా వ‌స్తే..వెంట‌నే నాయ‌కులు, క్యాడ‌ర్ లో ఆ జోష్ నింప‌టం క‌ష్టం అవుతుంద‌నే విజ‌య‌గ‌ర్జ‌న వాయిదా వేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story
Share it