Telugu Gateway
Politics

విశాఖ ఉక్కు ఉద్యమానికి కెటీఆర్ మద్దతు

విశాఖ ఉక్కు ఉద్యమానికి కెటీఆర్ మద్దతు
X

'ఇవాళ ఎక్కడో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంటే మనకెందుకులే అనుకోవద్దు. ఇవాళ వాళ్లకు జరుగుతుంది. రేపు మనకు జరగొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తర్వాత బిహెచ్ఈఎల్, సింగరేణి కూడా అమ్ముతారు. వీటిని అడ్డుకోవాల్సి ఉంది.' అని తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ప్లాంట్ ను వంద శాతం విక్రయిస్తామని కేంద్రం చెబుతోందని..ఇది ఏ మాత్రం సరికాదన్నారు. ''అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటాం. కేసీఆర్ అనుమతితో కొంత మందిమి విశాఖ వెళ్లి మద్దతు ఇస్తాం.

ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రధాని ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారు'' అంటూ కేటీఆర్‌ విమర్శించారు. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతేనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని.. అది కూడా నిర్దిష్ట విషయాల్లో మాత్రమే సంప్రదిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యే అంశాల్లో ఈ సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది.

Next Story
Share it