Telugu Gateway
Politics

పార్ల‌మెంట్ లో తెలంగాణ వాద‌న గట్టిగా విన్పించాలి

పార్ల‌మెంట్ లో తెలంగాణ వాద‌న గట్టిగా విన్పించాలి
X

పార్ల‌మెంట్ స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన వ్యూహంపై ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎంపీల‌కు కెసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంటు వేదికగా పోరాడాలని సూచించారు.

కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లు,. విద్యుత్‌ చట్టాల ఉపసంహరణ.. విద్యుత్‌ మీటర్లతోపాటు న‌దీ జ‌లాల కేటాయింపు అంశంపై కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్‌ సూచించారు. ఇప్పటికే తాము.. చాలా ఓపిక పట్టామని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదీలేదన్నారు.

Next Story
Share it