మునుగోడులో కెసీఆర్ హుజూరాబాద్ కసి తీర్చుకుంటారా!
అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి. హుజూరాబాద్ ఓటమి కసిని తీర్చుకోవటానికి మునుగోడు ఉప ఎన్నికను ఓ అవకాశంగా మార్చుకోవాలని యోచిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నిక అంటే తమకేమీ భయంలేదనే సంకేతాలు ఇచ్చేందుకే సర్కారు ఆగమేఘాల మీద రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకుందని భావిస్తున్నారు. ఈ ఎన్నికలో గెలుపు ద్వారా బిజెపి దూకుడుకు బ్రేకులు వేయాలన్నది టీఆర్ఎస్ ప్లాన్. అయితే రాజీనామా ఆమోదం అయితే జరిగింది కానీ..ఉప ఎన్నికలు వస్తాయా...లేక తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్నది వేచిచూడాల్సిందే. ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత అయితే లేదు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.