న్యాయవాదుల హత్య వెనక టీఆర్ఎస్ హస్తం
BY Admin18 Feb 2021 11:30 AM

X
Admin18 Feb 2021 11:30 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాదుల హత్యల వెనక టీఆర్ఎస్ హస్తం ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్ లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. నిందితులపై కిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కొంత మంది పోలీసు అధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నాని అన్నారు. న్యాయవాదుల హత్య న్యాయవ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. సీఎం కెసీఆర్ మౌనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు, సీఎం కెసీఆర్ కు లాయర్లు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story