Telugu Gateway
Politics

ఒక్క ఏడాదిలో 250 కోట్లు పెరిగిన బిఆర్ఎస్ ఆస్తులు !

ఒక్క ఏడాదిలో 250 కోట్లు పెరిగిన బిఆర్ఎస్ ఆస్తులు !
X

తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ ఆస్తులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే ఆ పార్టీ ఆస్తులు 250 కోట్లు పెరగటం విశేషం. గత ఏడాది హైటెక్స్ లో జరిగిన ప్లీనరీలో సీఎం కెసిఆర్ తమ పార్టీ కి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. తాజాగా అంటే గురువారం నాడు బిఆర్ఎస్ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో మరో సారి సీఎం కెసిఆర్ స్వయంగా ఆస్తుల వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 1250 కోట్ల రూపాయల నిధులు ఉన్నట్లు చెప్పారు. అదే సమయంలో ఇందులో 767 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తే దానిపై నెలలు ఏడు కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది అని వెల్లడించారు. పార్టీ నిర్వహణ తో పాటు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, ప్రచారం, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

పార్టీ ఆర్థిక వ్యవహారాలకు అద్యక్షులే చూసుకుంటారు అని...కోశాధికారి అధ్యక్షుడికి సహాయకారిగా ఉంటారని ప్రకటించారు. అంటే ఎవరిని నమ్మకుండా నిధుల వ్యవహారం అంత కెసిఆర్ తన చేతుల్లోనే పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది. గత ఏడాది ప్లీనరీలో మాట్లాడిన కెసిఆర్ 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు రూ.1000 కోట్ల ఆస్తులు కలిగి తెలంగాణకు శ్రీరామరక్షగా మిగిలిపోయే రాజకీయపార్టీ టీఆర్‌ఎస్‌ అని, రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న సైనికుల, కాపలాదారుల పార్టీ అని చెప్పారు. ప్రతి ఏటా అధికార బిఆర్ఎస్ ఆస్తులు ఇలా పెద్ద ఎత్తున పెరుగుతూ పోతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it