Telugu Gateway
Politics

టీఆర్ఎస్ కొత్త జిల్లా అధ్య‌క్షులు వీరే...33 జిల్లాల‌కూ నియామ‌కం

టీఆర్ఎస్ కొత్త జిల్లా అధ్య‌క్షులు వీరే...33 జిల్లాల‌కూ నియామ‌కం
X

అధికార టీఆర్ఎస్ గ‌త కొంత కాలంగా పార్టీ వ్య‌వ‌హారాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. సార్వ‌త్రిక ఎన్నికల‌కు స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీతోపాటు పార్టీ కార్య‌క‌లాపాలు జోరు పెంచారు.అందులో భాగంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 33 జిల్లాల‌కు కొత్త అధ్య‌క్షులను ప్ర‌క‌టించారు. ఇందులో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్లే ఉండ‌టం విశేషం. కొన్ని చోట్ల ఎంపీల‌కు కూడా జిల్లా బాధ్య‌త‌లు ఇచ్చారు. ఒకే సారి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ఇలా జిల్లా అధ్య‌క్షులను నియ‌మించ‌టం ఇదే మొద‌టిసారి.

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుల జాబితా

1.ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే

2. కొమురం భీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే

3. మంచిర్యాల- సుమన్, ఎమ్మెల్యే

4. నిర్మల్- జి. విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే

5. నిజామాబాద్- ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే

6. కామారెడ్డి- యం.కె. ముజీబుద్దీన్, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్

7. కరీంనగర్ -జి.వి. రామకృష్ణారావు, ఛైర్మన్, సుడా

8. రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ

9. జగిత్యాల- కె. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే

10. పెద్దపల్లి- కోరుకంటి చందర్, ఎమ్మెల్యే

11. మెదక్- యం పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్యే

12. సంగారెడ్డి- చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే

13. సిద్దిపేట- కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ

14. వరంగల్- అరూరి రమేష్, ఎమ్మెల్యే

15. హనుమకొండ- దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే

16. జనగామ- పి. సంపత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్

17. మహబూబాబాద్- మాలోతు కవిత నాయక్, ఎంపీ

18. ములుగు - కుసుమ జగదీశ్, జెడ్పీ చైర్మన్

19. జయశంకర్ భూపాలపల్లి - గండ్ర జ్యోతి, జెడ్పీ ఛైర్మన్

20. ఖమ్మం- తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ

21. భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతా రావు, ఎమ్మెల్యే

22. నల్గొండ - రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే

23. సూర్యాపేట -బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ

24. యాదాద్రి భువనగిరి -కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఛైర్మన్, ఆయిల్ ఫెడ్

25. రంగారెడ్డి - మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే

26. వికారాబాద్ - డా. మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే

27. మేడ్చెల్ - శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ

28. మహబూబ్ నగర్ - సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే

29. నాగర్ కర్నూల్ - గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే

30. జోగులాంబ గద్వాల - బి. కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే

31. నారాయణపేట - ఎస్. రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే

32. వనపర్తి - ఏర్పుల గట్టుయాదవ్, మున్సిపల్ ఛైర్మన్

33. హైదరాబాద్ - మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే

Next Story
Share it