Telugu Gateway
Politics

బారామతి వెళుతుండగా ప్రమాదం

బారామతి వెళుతుండగా ప్రమాదం
X

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ ప్రమాదంలో చిక్కుకుంది. ముంబయి నుంచి ఆయన బారామతి లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చోటు చేసుకున్నాయి. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితి మాత్రం భయంకరంగా ఉంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం చూస్తే ఇందులో ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేనంత భయంకరంగా ఉంది అని చెప్పాలి.

ఈ ప్రమాదం జరిగిన చోటుకు పోలీస్ లు ..ఇతర అధికారులు చేరుకున్నారు. . అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఫ్లైట్ లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇందులో నలుగురు ప్రయాణికులు అయితే...ఇద్దరు సిబ్బంది అని చెపుతున్నారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మొత్తం ఆరుగురు చనిపోయినట్లు డీజీసీఏ వెల్లడించింది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Next Story
Share it