కెసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ రక్తం ఏందో మోడీకి చూపిస్తాం
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది నుంచి మాట్లాడితే కేసీఆర్ ను జైళ్లో పెడతా అంటున్న వెదవలారా దమ్ముంటే విచారణ చేయండి. జైల్లో పెడతామని ఏడాది నుంచి మొరుగుతున్నారు. ఎవరి జైలు కు పొయిండ్రో గుర్తు చేసుకోవాలి అంటూ మంత్రి బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ పై మండిపడ్డారు. కేసీఆర్ ను టచ్ చేసి చూడండి. తెలంగాణ పౌరుషం..రక్తం ఏందో మీ మోడీకి చూపిస్తామని హెచ్చరించారు. రైతు బంధు సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారు. ఇది కేసీఆర్ తో జరగలేదా ? బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా ? తెలంగాణ వాళ్ళు బీహార్, మదే ప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారా ? బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిలు ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఇట్లా ఉంది. ఇద్దరు అబద్దాలకోర్లు మొరుగుతున్నరు. ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదు. నిజామాబాదోడికి నెత్తిమీద లేదు, లోపల కూడా లేదు.
కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు, సాగునీరు మీ పాలిత రాష్ట్రంలో ఇస్తున్నారా ? నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. అర్వింద్, సంజయ్ రాజీనామా చేస్తారా ? సవాల్ స్వీకరించాలి. గెలిచిన 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని మాటతప్పిన సిగ్గులేనివాడు అర్వింద్. సిగ్గులేకుండా ఇంకా గ్రామాల్లో తిరుగుతున్నాడు. దేశ వ్యవసాయ మంత్రి పసుపుబోర్డు ఇవ్వాలన్న ఆలోచన లేదు అని చెప్పిన వెంటనే బాయిల బండ కట్టుకొని చచ్చిపోవాలి. నేనైతే అదే పని చేస్తుంటి. ఆంబోతు లెక్క ఊర్ల మీద పడి అర్వింద్ తిరుగుతున్నడు. మాట తప్పినోన్ని, మాట ఇచ్చిన వాళ్ళను ఒకే దగ్గర ఉంచుతారా ? ప్రజలు ఆలోచించుకోవాలి.రైతుల కోసం ఇన్ని చేస్తున్న కేసీఆర్ ను తిడతావ ?. బాండు పేపర్ రాసిచ్చి తప్పిన వాడివి నీదా మొగతనం ? కాళేశ్వరం నుంచి రూ. 1650 కోట్లతో నీళ్లను తెచ్చిఎస్సారెస్పీ ప్రాజెస్ట్ నింపినం మాది మగతనం.
వంద కోట్ల రూపాయలతో 18 చెక్ డ్యామ్ లు నిర్మించినం. ప్యాకెజ్ 21 ద్వారా ప్రతి ఎకరాకు మిగులకుండా నీళ్లు అందివ్వనున్నాం. దీనికి రూ.850 కోట్ల ఖర్చు చేసి నీళ్ళుస్తునం. ఇది మగతనం. ఇట్లా రైతాంగం కోసం కేసీఆర్ చేస్తున్నారు. ఒక్క బాల్కొండలొనే 16 సబ్ స్టేషన్ లు కొత్తవి తెచ్చాను. రూ. 50 కోట్లతో సబ్ స్టేషన్ ల కొసం ఖర్చు చేశాం. ఇలా అన్ని కలిపి రూ. 2200 కోట్లు కేవలం రైతుల కోసం ఇప్పటి వరకు బాల్కొండలో ఖర్చు చేశాము. ఇలా ప్రతి ఎకరానికి సరాసరి రూ. 3లక్షల కోట్లు ఖర్చు చేశాము. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయ ? రేవంత్ బుడ్ధార్ ఖాన్, సంజయ్ మెంటల్ గాడు, అర్వింద్ గాడికి ఏమి లేదని ప్రజలకు అర్థం అయ్యింది.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.