Telugu Gateway
Politics

హుజూరాబాద్ లో పోటీచేస్తాం

హుజూరాబాద్ లో  పోటీచేస్తాం
X

తెలంగాణ జ‌న స‌మితి (టీజెఎస్)ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధినేత కోదండ‌రామ్ మండిప‌డ్డారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయినందున టీజెఎస్ కాంగ్రెస్ లో విలీనం అయ్యే ఛాన్స్ ఉందంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారాన్ని కోదండ‌రాం తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు.

లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

Next Story
Share it