ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు
BY Admin16 March 2021 11:41 AM

X
Admin16 March 2021 11:41 AM
తెలంగాణ, ఏపీలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో తిరుపతి లోక్ సభకు, తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గప్రసాద్, నోముల నర్సింహయ్యల హఠాన్మరణంతో ఉప ఎన్నికలు అనివార్యం అయిన విషయం తెలిసిందే.
తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరగనుంది. మార్చి 23న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మే2న కౌంటింగ్ జరుగుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో పాటే ఇవి కూడా వెల్లడికానున్నాయి.
Next Story