Telugu Gateway
Politics

తెలంగాణలో మంత్రులందరూ డమ్మీలే

తెలంగాణలో మంత్రులందరూ డమ్మీలే
X

దేశంలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెడితే.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి వ్యాక్సిన్ కనిపెట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగించి విజయవంతం అయ్యాయని..త్వరలోనే ఖమ్మంలో కూడా ఈ వ్యాక్సిన్ ను ఉపయోగిస్తామన్నారు. ఖమ్మం పర్యటన సందర్భంగా సంజయ్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామన్నారు. బీజేపీని విమర్శించడానికి మంత్రికి సిగ్గుండాలంటూ ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ.. తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు. ''నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.. అక్రమ భూములను రెగ్యులర్ చేయించుకోవడానికి టీఆర్ఎస్‌లోకి చేరారు.

మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన అక్రమాలన్ని బయట పెడతాం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన పాలన పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదు. వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం.. రెండు చోట్ల విజయవంతం అయింది. తర్వాత ఖమ్మం కార్పొరేషన్‌లో వ్యాక్సిన్ ప్రయోగించ బోతున్నాం. తెలంగాణలో మంత్రులందరూ డమ్మిలేనంటూ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. బిజెపి, టీఆర్ఎస్ ఒక్కటే అని కొంత మంది నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Next Story
Share it