కెసీఆర్ చేసిన తప్పేంటి?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కెసీఆర్ పై చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. వరవరరావు అరెస్ట్ పై కెసీఆర్ స్పందించలేదని చెప్పిన ఈటెల ఆయన్ను అరెస్ట్ చేయించిన పార్టీలో ఎందుకు చేరుతున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ తనకు నచ్చని పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఆయన సీఎం కెసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కు- ఈటెలకు ఆరేళ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చింది?. కేసీఆర్అనే వ్యక్తి- టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండే వారు. ఈటెల పై నమ్మకంతో ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఈటెల తాను చేసి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.హరీష్ రావు ను కాదని ఈటెలకు ఫ్లోర్ లీడర్ పదవి కేసీఆర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ముందు- పార్టీలోకి వచ్చిన తరువాత ఈటెల ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ చేసిన తప్పు ఏంటో ఈటెల రాజేందర్ చెప్పాలి?. ఆరు సార్లు ఎమ్మెల్యే గా టీఆర్ఎస్ పార్టీ- కేసీఆర్ లేకుండా ఈటెల పేరుమీద గెలిచారా?. ఈటెల రాజేందర్ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. హుజురాబాద్ లో అభివృద్ధి చేసే పార్టీకి- అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు పోటీ. తెలంగాణ అభివృద్ధికి సహకరించని పార్టీ బీజేపీ.
ఐదేళ్లు దూరం పెట్టి మారేందుకు అవకాశం ఇచ్చినా ఈటెలలో మార్పు రాలేదు. ఈటెలకు- కేసీఆర్ కు గ్యాప్ ఉన్నా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఈటెలకు కేసీఆర్ కట్టబెట్టారు. బీజేపీ భూ స్థాపితం అవుతుందని అన్న ఈటెల- ఎందుకు బీజేపీ లో చేరుతున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటెల పాత్ర ఏంటో చెప్పాలి?. ఈటెల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ను గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తించేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కరీంనగర్ లో ఈటెల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు. కొద్ది రోజుల క్రితం బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరుతున్నారని ప్రశ్నించారు. అసైన్ మెంట్, దేవాదాయ భూములను కొనుగోలు చేయకూడదు అని ఈటెలకు తెలియదా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించింది.