నిరూపిస్తే రాజీనామా చేస్తా
రియల్టర్ ను బెదిరించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పందించారు. ఆ ఆడియో టేప్ తనదే అని నిరూపిస్తే సత్వరమే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ కు చెడ్డపేరు తెచ్చే పనులు తాను ఎప్పుడూ చేయనన్నారు. తనకు ఎంతో ఆస్థి ఉందని..అలాంటిది తాను బెదిరించి డబ్బు వసూలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. మంత్రి స్పందన ఆయన మాటల్లోనే...'నాపై ఇలాంటి నిరాధార ఆరోపణలు సమంజసం కాదు.
నా దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయి. ఆ ఆడియో నాది అని తేలితే నేను రాజీనామాకు సిద్ధం. ఈ ఆడియో ఎక్కడినుండి వచ్చిందో నా మనుషులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే చేశారు అది కూడా వాస్తవం కాదని తేలింది. షామిర్ పేట్ వెంచర్ విషయంలో నా ఆడియో నాది కాదు. మిమిక్రీ ఆర్టిస్టులు చేశారు అనుకోవచ్చు కదా.' అని వ్యాఖ్యానించారు.