Telugu Gateway
Politics

దేశ భక్తే కాదు...రాష్ట్ర భక్తి కూడా ఉండాలి

దేశ భక్తే కాదు...రాష్ట్ర భక్తి కూడా ఉండాలి
X

బిజెపిపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. 'దేశ భక్తి ఉంటే చాలదు...రాష్ట్ర భక్తి కూడా ఉండి. రాష్ట్ర బీజేపీ నేతలు క్షుద్ర రాజకీయాలు చేయడం తగదు. ఇక్కడి ప్రజలు గెలిపిస్తే అక్కడికి వెళ్లిన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి.అన్ని అనుమతులు వచ్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయడం వెనుక అంతర్యం ఏంటో బండి సంజయ్ చెప్పాలి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయిన వాళ్లం ప్రజలకు సేవ చేయడానికి వస్తాం. ప్రజాస్వామ్యంలో పని చేసేవాళ్లం, పదవులు శాశ్వతం కాదు. రాష్ట్ర ప్రజలు శాశ్వతం. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. కాని క్షుద్ర రాజకీయాల కోసం, స్వార్థం కోసం రాష్ట్రంలో రాజకీయాలు చేయడం దురదృష్ణకరం. పదవులకోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా సభ్యులు పని చేయడం బాధాకరం.

బండి సంజయ్ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసి లేఖ ఇచ్చారు.కేంద్ర జలమంత్రిత్వ శాఖ అన్ని అనుమతులు ఇచ్చేదాక మీరు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వద్దు. దీని కోసం అవసరమయితే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక చట్టం తీసుకురండి అని లేఖ ఇచ్చారు. దేశం కోసం కాదు.. రాష్ట్రం కోసమే చట్టం తేవాలంట. సెంట్రల్ వాటర్ కమిషన్ లో 16 అనుమతులు తీసుకోవాలి, అటవీ, పర్యావరణ అనుమతులకు ట్రై చేస్తాం. కాని సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చేదాకా పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు అని లేఖ ఇచ్చారు. నీటి పారుదల శాఖ మంత్రి షెకావత్ కూడా లేఖ ఇచ్చారు. దేశ భక్తి అని ఎక్కువగా వాళ్లు మాట్లాడుతుంటారు. దేశ భక్తి సరే. స్వరాష్ట్ర భక్తి ఎక్కడ పోయింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరూ ఆలోచించాలి. మీరు సహకారం అందించండి లేదా సాయం చేయండి అంతే కాని కాళ్లల్లో కట్టెలు పెట్టకండి. కొందరు కేసులు వేశారు. రైతులను రెచ్చగొట్టారు. కోర్టుల్లో, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. వీరు ఇప్పుడు ఏకంగా చట్టమే తేవాలంటున్నారు. దేశమంతా ఒక చట్టం అయితే తెలంగాణకు మరో న్యాయం అంటున్నారు. ' అని ఫైర్ అయ్యారు.

Next Story
Share it