కరోనా జాగ్రత్తలతో మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ సర్కారు మున్సిపల్ ఎన్నికల విషయంలో ముందుకెళ్ళటానికే రెడీ అయింది. కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యల తీసుకుంటామని, ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది. దీంతో ఎస్ఈసీ పార్ధసారధి కూడా ఎన్నికల విషయంలో ముందుకెళ్ళటానికి రెడీ అయ్యారు. దీంతో ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు సాగనున్నాయి. 'రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలి. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు' అని వెల్లడించారు.
రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ వినతిని పరిశీలించాలని ఎస్ఈసీని కోరిన కోర్టు..ఎన్నికల నిలుపుదల విషయంలో తాము జోక్యంచేసుకోలేమని ప్రకటించింది. ఎస్ ఈసీ పార్ధసారధి కూడా కోవిడ్ బారిన పడ్డారు. అయితే ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన ఎస్ఈసీ..ఎన్నికలతో ముందుకు వెళ్లటానికే నిర్ణయం తీసుకుంది.