తెలంగాణలో కొత్తగా 80039 ఉద్యోగాల భర్తీ
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ముందు ప్రకటించినట్లుగానే బుధవారం నాడు శాసనసభలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఆయా శాఖలు వరస పెట్టి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కోర్టు అనుమతితోనే ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పట్టువిడవకుండా న్యాయపోరాటం చేసి..ఇందులో విజయం సాధించినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ఇలా ఉండబోతుంది.
గ్రూప్1 పోస్టులు 503, గ్రూపు 2: 582, గ్రూప్ 3:1373, గ్రూప్...4: 9168, జిల్లా స్ధాయి లో 39829, జోనల్ స్థాయిలో..;18866, మల్లీజోన్ లో 13170, ఇతర కేటగిరి.వర్సిటీలు..: 8174, ఖాళీ కానున్న మొత్తం పోస్టులు 80039 భర్తీ చేయనున్నారు. వెంటనే భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ ఖాళీల భర్తీ వల్ల 7000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని..అయినా సరే ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరన్నారు. ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని..ఎప్పటికప్పుడు ఆయా శాఖలు వివరాలు ప్రకటిస్తాయన్నారు. దీని కోసం పాలసీ తెస్తున్నాం. గందరగోళం తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.