Telugu Gateway
Politics

తెలంగాణ, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

తెలంగాణ, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఏపీ నుంచి ఈ కోటా కింద ముగ్గురు ఎమ్మెల్సీలు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు వరసగా మే 31, జూన్ 3న రిటైర్ కానున్నారు. ఈ ఖాళీల భర్తీకి నోటిపికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ పరిస్థితిపై ఎన్నికల కమిషన్ గురువారం నాడు చర్చించింది.

కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సమయంలోఎన్నికలు పెట్టడం సరికాదని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత కమిషన్ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Next Story
Share it