తెలంగాణ బీజేపీ అలజడి ఆగిపోతుందా?!

రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ సారధులు మారారు. తెలంగాణ బీజేపీ నూతన ప్రెసిడెంట్ గా కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి నియమతులు అయ్యారు. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ మార్పు విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రచారమే నిజం అయి ప్రస్తుత ప్రెసిడెంట్ బండి సంజయ్ ని తప్పించారు. దీంతో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కిషన్ రెడ్డి సారథ్యంలోనే ముందుకు సాగనుంది. దీంతో ఇక నుంచి రాజకీయం ఎలా సాగుతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను మార్చింది.
పంజాబ్ బీజేపీ చీఫ్‌గా సునీల్ జఖర్, జార్ఖండ్‌కు బాబూలాల్ మరండీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని జేపీ నడ్డా నియమించారు. మరోవైపు.. తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను పార్టీ నియమించింది. అసలు ఏ మాత్రం అలికిడి లేకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మార్పులతో తెలంగాణ బీజేపీలో అలజడి ఆగుతుందా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు.



