Telugu Gateway
Politics

తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణ బాధ్యత లోకేష్ కమిటీకి

తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణ బాధ్యత లోకేష్ కమిటీకి
X

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భరంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక విధేయతలు, మొహమాటాలకు చరమగీతం పాడి క్షేత్రస్థాయిలో తెగించి పోరాడేవారికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. నాయకులు క్షేత్రస్థాయి పనితీరుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అద్దంపడుతున్నాయన్నారు. ప్రతి క్లస్టర్కు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఐదుగురితో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీ ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కమిటీలో లోకేశ్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ ఉంటారని చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నానని తిరుపతి ఉపఎన్నిక టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ చంద్రబాబుకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోపు ఇదే పెద్ద ఉపఎన్నిక అని చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు. వైసీపీ వైఫల్యాలను ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు నాయకులు వివరించాలని అన్నారు. ఇక నుంచి తెగించి పోరాడే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు. నిర్లక్ష్యం వహించే వారికి పార్టీ పదవులు ఉండవన్నారు.

Next Story
Share it