Telugu Gateway
Politics

ఎస్ఈసీ సమావేశానికి పార్టీల డుమ్మా

ఎస్ఈసీ సమావేశానికి పార్టీల డుమ్మా
X

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశాన్ని టీడీపీ, జనసేన, బిజెపి బహిష్కరించాయి. ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం అని చెప్పి..ముందే నోటిపికేషన్ జారీ చేయటాన్ని ఇవి తప్పుపట్టాయి. అంతే కాదు..పాత నోటిఫికేషన్ కాకుండా...ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్ ను ఎస్ఈసీ తోసిపుచ్చారు. గురువారం సాయంత్రమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి అధికార వైసీపీతో పాటు కాంగ్రెస్, సీపీఐ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిరసన తెలిపి వెళ్లిపోయింది. ఈ సమావేశం అనంతరం నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. అన్ని పార్టీలు ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. గతంలోనే అభ్యర్ధుల జాబితా పూర్తి అయిందని..ఈ దశలో ఎన్నికలు ఆపేందుకు సరైన కారణాలు లేవన్నారు. ఎన్నికల ప్రచారంలో నేతలు కోవిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Next Story
Share it