ఇది ఆత్మగౌరవం..అహంకారానికి మధ్య యుద్దం
తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ శుక్రవారం నాడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర బిజెపి నేతలతో కలసి వీరంతా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈటెల రాజేందర్ ఈ నెల14న బిజెపిలో చేరనున్నారు. అంతకంటే ముందు అంటే శనివారం నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంలో ఈటెల రాజేందర్, తరుణ్ ఛుగ్ భేటీ జరిగింది.ఈ సమావేశం అనంతరం తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అత్మగౌరవం..అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఒక్క వ్యక్తి అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటెల గొంతు వినిపించారన్నారు.
ఇన్నాళ్లు ఈటెల టీఆర్ఎస్ లో సంఘర్షణ చేశారు..తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారు. కెసిఆర్ కు ఆయన కుటుంబం ఎక్కువ అయింది తెలంగాణ గౌరవం చులకన అయ్యిందన్నారు. ఈటెల పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుంది..మా అందరి ఉదేశ్యం ఒక్కటే ..కేసీఆర్ అహంకారం ...రాజరికం తెలంగాణ నుండి పోవాలి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వికాసం కోసం ఎవరి తో అయిన కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈటెల బీజేపీ లోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడటం ఆయన అహంకార ఓడటం అని పేర్కొన్నారు.