నిమ్మగడ్డపై స్పీకర్ ఫైర్
BY Admin23 Jan 2021 12:18 PM

X
Admin23 Jan 2021 12:18 PM
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరపలేదు? అని ప్రశ్నించారు. కరోనా అంటూ వాయిదా వేసింది ఎస్‌ఈసీ కాదా అని తమ్మినేని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడితే ఎవరు కంట్రోల్ చేస్తారు? అని ప్రశ్నించారు. ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించలేమన్నా ఎలా ఎన్నికలు పెడతారని, కొంతమంది వ్యక్తుల లబ్దికోసం ఎన్నికలు వద్దని సూచించారు. ఎన్నికలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సుప్రీం అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
Next Story