తమిళనాడులో డీఎంకె హవా
BY Admin29 April 2021 8:45 PM IST
X
Admin29 April 2021 8:45 PM IST
తమిళనాడు ఫలితాలు ముందు నుంచి ఊహించినట్లే ఉండబోతున్నాయా?. ఎగ్జిట్ పోల్్క చూస్తే అదే నిజం అన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో డీఎంకె తన హవా చూపించబోతుంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకె 175-195 సీట్లను దక్కించుకోనుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకె 38 నుంచి 54 సీట్లకు పరిమితం కానుంది.
టుడేస్ ఛాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకెకు 175కు పైగా స్థానాలు దక్కనున్నాయి. రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 165 సీట్లతో డీఎంకె ముందంజలో ఉండబోతుంది. తమిళనాడు విషయంలో అన్ని ఛానళ్లు మాత్రం డీఎంకె గెలుపు విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి.
Next Story