మేం కూల్చం..మీ గోయ్యి మీరే తవ్వుకుంటున్నారు
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ వ్యవహరాల బిజెపి ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ స్పందించారు. ట్విట్టర్ లో ఆయన కామెంట్స్..'పేర్ని నాని గారు-మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు,ఆ ఆలోచన కూడా మాకులేదు. ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టారు.
అది చాలదన్నట్టు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు. కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి?. కేంద్రానికున్న ఆర్థిక స్థోమత,వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నదా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు. మేం దేశ ప్రతిష్ట పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు.' అంటూ వ్యాఖ్యానించారు.